ONGC Recruitment: ఓఎన్‌జీసీలో భారీగా అప్రెంటిస్‌ పోస్టుల భర్తీ.. దేశవ్యాప్తంగా 3614 ఖాళీలు..

ONGC Recruitment: ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ONGC) పలు అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశవ్యాప్తంగా వివిధ విభిగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. దేశంలోని పలు సెక్టార్స్‌లో ఉన్న మొత్తం 3614 పోస్టులను రిక్రూట్‌ చేయనున్నారు...

ONGC Recruitment: ఓఎన్‌జీసీలో భారీగా అప్రెంటిస్‌ పోస్టుల భర్తీ.. దేశవ్యాప్తంగా 3614 ఖాళీలు..
Ongc Recruitment

Updated on: May 06, 2022 | 7:38 AM

ONGC Recruitment: ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ONGC) పలు అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. దేశవ్యాప్తంగా వివిధ విభిగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. దేశంలోని పలు సెక్టార్స్‌లో ఉన్న మొత్తం 3614 పోస్టులను రిక్రూట్‌ చేయనున్నారు. ఏయే సెక్టార్‌లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఏ ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీచేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 3614 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో నార్తర్న్‌ సెక్టర్‌ (209), ముంబై సెక్టర్‌ (305), వెస్టర్న్‌ సెక్టర్‌ (1434), ఈస్టర్న్‌ సెక్టర్‌ (744), సదరన్‌ సెక్టార్‌ (694), సెంట్రల్‌ సెక్టర్‌ (228) ఖాళీలు ఉన్నాయి.

* అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్‌ అసిస్టెంట్లు, ఎలక్ట్రీషియన్, సెక్రటేరియల్‌ అసిస్టెంట్, ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్లు, మెకానిక్‌ డీజిల్, వెల్డర్, డ్రాఫ్ట్స్‌మెన్‌(సివిల్‌), కోపా ట్రేడ్స్‌లో అప్రెంటిస్‌ పోస్టులు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

* అభ్యర్థుల వయసు 15-05-2022 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను అర్హత పరీక్షలో వచ్చిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ట్రేడ్‌ అప్రెంటిస్‌లకు ఎంపికైన వారికి మొదటి ఏడాది నెలకు రూ.7700, రెండో ఏడాది నెలకు రూ.8050, డిప్లొమా అప్రెంటిస్‌లకు నెలకు రూ.8000, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లకు నెలకు రూ.9000 స్టైపండ్‌గా చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 15-05-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తలకు క్లిక్ చేయండి..

Also Read: DC Vs SRH: వరుసగా మూడో ఓటమి నమోదు చేసిన హైదరాబాద్‌.. ఢిల్లీ చేతిలో 21 పరుగుల తేడాతో పరాజయం..

Syllabus Pattu Job Kottu: పోలీస్‌ జాబ్‌ మీ కలా? అయితే ఈ 5 విషయాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి..

Chandrababu Naidu: అన్ని రాష్ట్రాల్లో కంటే ఏపీలోనే పన్నులెక్కువ.. వైసీపీపై మరోసారి ధ్వజమెత్తిన చంద్రబాబు..

Loading...
Unable to load recommendations.
Follow Us