OIL India Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన నవరత్న సంస్థ అయిన ఆయిల్ ఇండియా లిమిటెడ్ (Oil India Limited) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 62
ఖాళీల వివరాలు: గ్రేడ్ – III, V పోస్టులు
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత కోర్సుల్లో ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
వయో పరిమితి: అభ్యర్ధుల వయసు ఫిబ్రవరి 25, 2022 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష (CBT) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: మొత్తం 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు 2 గంటల్లో సమాధానాలు రాయవల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కులు లేవు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 25, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: