
హైదరాబాద్, ఏప్రిల్ 27: నీట్ యూజీ 2026 అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆదివారం (ఏప్రిల్ 26) రాత్రి విడుదల చేసింది. ఈ మేరకు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 26న విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inలో తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీని నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
నీట్ యూజీ అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కాగా నీట్ యూజీ 2026 పరీక్ష మే 3వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒకే షిఫ్ట్‌లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరుగుతుంది. ఇందుకు దేశ వ్యాప్తంగా 552 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఎన్టీయే ఏర్పాటు చేసింది. అడ్మిట్ కార్డు లేకుండా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదు. కాబట్టి విద్యార్ధులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డుతోపాటు ఏదైనా ఒక ఫొటో ఐడెంటిటీ కార్డును తప్పనిసరిగా పరీక్ష రోజు కేంద్రానికి తీసుకెళ్లవల్సి ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్ధులు తమ ఫొటో, ఇతర వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అడ్మిట్ కార్డులో అభ్యర్థి పేరు, రోల్ నంబర్, అప్లికేషన్ నంబర్, పరీక్ష తేదీ, సమయం, పరీక్షా కేంద్రం చిరునామా వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. వీటిల్లో ఏవైనా సమస్యలు ఉంటే అభ్యర్థులు పరీక్ష తేదీకి ముందు సవరణ కోసం NTAని సంప్రదించాల్సి ఉంటుంది.
NEET (UG) 2026 Admit Cards are now LIVE.
📅 Exam: 03 May 2026 (2:00 PM – 5:00 PM)
Candidates can download their admit cards from the official website using their login credentials.
Stay updated & check all instructions carefully.#NEET2026 #NTA #AdmitCard pic.twitter.com/og2xzFkHpn— National Testing Agency (@NTA_Exams) April 26, 2026
నీట్ యూజీ అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక నీట్ యూజీ 2026 పరీక్ష పెన్, పేపర్ విధానంలో OMR షీట్‌పై నిర్వహిస్తుంది. ఇందులో 180 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 720 మార్కులు కేటాయిస్తారు. పరీక్ష వ్యవధి 3 గంటలు. ప్రతి సమాధానానికి 4 మార్కులు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు చొప్పున కోత విధిస్తారు.
నీట్ యూజీ అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.