NMDC Recruitment: నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NMDC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 130 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో మెకానిక్ డీజిల్ (25), ఫిట్టర్, ఎలక్ట్రిషియన్ (30), వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రికల్) (20), మెకానిక్ (మోటర్ వెహికిల్) (20), ఆటో ఎలక్ట్రిషియన్ (2), మెకానిస్ట్ (5), కెమికల్ ల్యాబ్ అసిస్టెంట్ (02), కెమికల్ ల్యాబ్ అసిస్టెంట్ (02), మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (02), మైనింగ్ మేట్ (02), బ్లాస్టర్ (02) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టుల భర్తీకి అప్లై చేసుకునే వారు పోస్టుల ఆధారంగా 10th, ITI, 12th, B.Sc ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ చేయాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఇంటర్వ్యూలను ఆగస్టు 25 నుంచి 30 వరకు నిర్వహిస్తారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి…