NMDC Recruitment 2022: గేట్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..నెలకు రూ.50,000ల జీతంతో ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు!

|

Mar 06, 2022 | 5:18 PM

భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌ ప్రధానకేంద్రంగా ఉన్న నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (NMDC) ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల (Executive Trainee Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

NMDC Recruitment 2022: గేట్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..నెలకు రూ.50,000ల జీతంతో ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు!
Nmdc
Follow us on

NMDC Limited Executive Trainee Recruitment 2022: భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌ ప్రధానకేంద్రంగా ఉన్న నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (NMDC) ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల (Executive Trainee Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 29

పోస్టులు: ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 27 ఏళ్లు మించరాదు. రిజర్వేషన్‌ వర్తిస్తుంది.

పే స్కేల్: నెలకు రూ.50,000లు, ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/ఎంబీఏ/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. అలాగే వ్యాలిడ్‌ గేట్‌ 2022 స్కోర్‌ ఉండాలి.

ఎంపిక విధానం: గేట్‌ 2022 స్కోర్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: రూ.500

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 25, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

AIIMS Patna 2022: నెలకు 67వేల జీతంతో.. ఎయిమ్స్ పాట్నలో ఫ్యాకల్టీ పోస్టులు.. రాత పరీక్షలేకుండానే ఎంపికలు..