NMDC Hyderabad 2022: గేట్‌ 2021 స్కోర్‌ ఆధారంగా.. హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు..

|

Mar 11, 2022 | 7:36 AM

భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌ ప్రధానకేంద్రంగా ఉన్న నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (NMDC) ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల (Executive Trainee Posts) భర్తీకి..

NMDC Hyderabad 2022: గేట్‌ 2021 స్కోర్‌ ఆధారంగా.. హైదరాబాద్‌లోని నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు..
Follow us on

NMDC Limited Executive Trainee Recruitment 2022: భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌ ప్రధానకేంద్రంగా ఉన్న నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (NMDC) ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల (Executive Trainee Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 29

పోస్టులు: ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 27 ఏళ్లు మించరాదు. రిజర్వేషన్‌ వర్తిస్తుంది.

పే స్కేల్: నెలకు రూ.60,000ల నుంచి రూ.1,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వ్యాలిడ్‌ గేట్‌ 2021 స్కోర్‌ ఉండాలి.

ఎంపిక విధానం: గేట్‌ 2021 స్కోర్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: రూ.500

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 23, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

APGPCET 2022: ఏపీ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు 2022-23 నోటిఫికేషన్‌ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..