NIT Warangal Jobs 2022: రూ.50 వేల జీతంతో వరంగల్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో హాస్టల్ మేనేజర్ పోస్టులు.. రాత పరీక్షలేకుండానే..

|

Sep 20, 2022 | 10:14 AM

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT Warangal).. ఒప్పంద ప్రాతిపదికన హాస్టల్ మేనేజర్ (మహిళ/పురుష) (Hostel Manager Posts) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌..

NIT Warangal Jobs 2022: రూ.50 వేల జీతంతో వరంగల్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో హాస్టల్ మేనేజర్ పోస్టులు.. రాత పరీక్షలేకుండానే..
Nit Warangal
Follow us on

NIT Warangal Hostel Manager Recruitment 2022: భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT Warangal).. ఒప్పంద ప్రాతిపదికన హాస్టల్ మేనేజర్ (మహిళ/పురుష) (Hostel Manager Posts) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే హాస్టళ్లు, మెస్‌లు, క్యాంటీన్‌ల నిర్వహణలో అనుభవం కూడా ఉండాలి. డిఫెన్స్‌/పార్లమెంటరీ ఫోర్సెస్‌లలో డిఫెన్స్ సర్వీసెస్ ఆఫీసర్స్/పర్సనల్ (ఇండియన్ ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్/GREFలో సర్వీస్ అందించి డిశ్చార్జ్ అయినవారు) లేదా రిటైర్డ్ ఆఫీసర్లు అయిన వారు, భారత పారా-మిలటరీ ఫోర్సెస్‌కు చెందిన అధికారులు/సిబ్బంది (BSF/CISF/CRPF/ITBP)కి ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తుదారుల వయసు అక్టోబర్‌ 15, 2022వ తేదీ నాటికి 50 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా అక్టోబర్‌ 15, 2022వ తేదీలోపు దరఖాస్తులు పంపించవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులు రూ.500లు అప్లికేషన్‌ ఫీజుగా చెల్లించవల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారికి నెలకు రూ.50,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌: The REGISTRAR, National Institute of Technology Warangal, NIT Warangal P.O., Telangana, PIN-506004

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.