నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఒడిశా రాష్ట్రంలోని రూర్కెలా క్యాంపస్‌లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 147 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో లైబ్రేరియన్ (1), ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్ (1), సూపరింటెండింగ్ ఇంజనీర్ (1), డిప్యూటీ రిజిస్ట్రార్ (1), సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (1), సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (1), సైంటిఫిక్ ఆఫీసర్ (1), స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ (1), అసిస్టెంట్ రిజిస్ట్రార్ (4), మెడికల్ ఆఫీసర్ (3), సూపరింటెండెంట్ (10), టెక్నికల్ అసిస్టెంట్ (36), జూనియర్ ఇంజనీర్ (3), ఎస్ఏఎస్ అసిస్టెంట్ (1), లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ (3), సీనియర్ అసిస్టెంట్ (13), జూనియర్ అసిస్టెంట్ (25), సీనియర్ టెక్నీషియన్ (12), టెక్నీషియన్ (29) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత విభాగంలో 10+2, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ /ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ 16-01-2023 తేదీన మొదలవుతుండగా చివరి తేదీగా 16-01-2023గా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..