Assistant Professor jobs: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!

|

Feb 23, 2022 | 1:48 PM

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన జార్ఖండ్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ జంషడ్‌పూర్‌ (NIT Jamshedpur)ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల (Assistant Professor posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

Assistant Professor jobs: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!
Nit Jamshedpur
Follow us on

NIT Jamshedpur Assistant Professor Recruitment 2022: భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన జార్ఖండ్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ జంషడ్‌పూర్‌ (NIT Jamshedpur)ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల (Assistant Professor posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 43

పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌, మ్యాథమేటిక్స్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, ఫిజిక్స్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా టీచింగ్ అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 56 ఏళ్లకు మించరాదు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌/ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: The Registrar, NIT Jamshedpur, Adityapur, Jamshedpur- 831014

దరఖాస్తు రుసుము: రూ. 1500

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 15, 2022.

పోస్టు ద్వారా హార్డ్‌ కాపీలను పంపడానికి చివరితేదీ: మార్చి 22, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

India Post Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!