NIMS Hyderabad Jobs: హైదరాబాద్‌ నిమ్స్‌లో రూ.1,23,100ల జీతంతో టీచింగ్‌ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని పంజాగుట్టలోవున్న నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ ..46 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

NIMS Hyderabad Jobs: హైదరాబాద్‌ నిమ్స్‌లో రూ.1,23,100ల జీతంతో టీచింగ్‌ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
NIMS Hyderabad

Updated on: Dec 16, 2022 | 10:24 AM

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని పంజాగుట్టలోవున్న నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ ..46 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనెస్తీషియాలజీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్‌, ఎండోక్రినాలజీ, జనరల్ మెడిసిన్‌, హెమటాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, మెడికల్ జెనెటిక్స్‌, నెఫ్రాలజీ, న్యూరోసర్జరీ, ఆర్థోపెడిక్స్, పాథాలజీ తదితర స్పెషలైజేషన్‌లలో ఖాళీలున్నాయి.

ఆసక్తి కలిగిన వారు సంబంధిత విభాగంలో ఎండీ/ఎంఎస్/డీఎన్బీ/డీఎం లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణతపొంది ఉండాలి. అలగే కనీసం మూడేళ్లపాటు టీచింగ్‌ అనుభవం ఉండాలి. వయసు తప్పనిసరిగా 50 యేళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో డిసెంబర్17, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌లో అప్లికేషన్లను సమర్పించాలి. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ రూ.500లు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.1,23,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్: The Executive Registrar, Punjagutta, NIMS, Hyderabad – 500082.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.