ICAR AIEEA 2021: వ్యవసాయ కోర్సుల్లో విద్యనభ్యసించాలనుకునే వారికి సదవకాశం. వ్యవసాయ కోర్సుల్లో యూజీ, పీజీ, పీహెచ్డీ ప్రవేశాల కోసం నిర్వహించే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చురల్ రిసెర్చ్ (ఐకార్) ఆలిండియా ఎంట్రెన్స్ ఎగ్జామ్ (ఏఐఈఈఏ) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2021-2022 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించనున్న ఈ ప్రవేశ పరీక్షకు ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..
ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా 75 అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. వీటిలో 64 రాష్ట్రీయ వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చురల్, ఫిషరీస్ వర్సిటీలు, 4 ఐసీఏఆర్ డీమ్డ్ యూనివర్సిటీలు, 3 సెంట్రల్ అగ్రికల్చురల్ యూనివర్సిటీలు, 4 సెంట్రల్లు యూనివర్సిటల్లోని వ్యవసాయ కోర్సుల్లో డిగ్రీ, పీజీ, ఏఐసీఈ జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ (పీహెచ్డీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
యూజీ కోర్సులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10+2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి. విద్యార్థుల వయసు 16 ఏళ్లు నిండాలి. ఇతర కోర్సులకు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
* విద్యార్థులను కంప్యూటర్ రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
* యూజీ కోర్సుల ప్రవేశ పరీక్షకు దేశవ్యాప్తంగా 178 నగరాలు, ఇతర కోర్సులకు 89 నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
* ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 20 చివరి తేదీగా నిర్ణయించారు.
* దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సెప్టెంబర్‌లో అడ్మిట్ కార్డులను అందిస్తారు.
* యూజీ ప్రవేశ పరీక్షను సెప్టెంబర్ 7,8 తేదీల్లో పీజీ, పీహెచ్డీ ప్రవేశ పరీక్షను సెప్టెంబర్ 17న నిర్వహిస్తారు.
* ఫలితాలను అక్టోబర్‌లో విడుదల చేసి అనంతరం తరగతులను ప్రారంభిస్తారు.
ఇలా దరఖాస్తు చేసుకోవాలి..
* అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ icar.nta.ac.inను ఓపెన్ చేయాలి.
* అనంతరం అప్లికేషన్ ఫామ్‌పై క్లిక్ చేసి ‘న్యూ రిజిస్ట్రేషన్’ను ఎంచుకొని సంబంధిత వివరాలను అందించాలి.
* అనంతరం ఫొటోతో పాటు, సిగ్నేచర్‌ను అప్లోడ్ చేయాలి.
* చివరిగా కేటాయించిన ఫీజును చెల్లించి. అప్లికేషన్ ఫామ్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.
Also Read: Metro Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మెట్రోలో ఉద్యోగాలు.. జీతం రూ.80 వేల నుంచి..!