JEE Session 2 Result: జులై 25 నుంచి 30వ తేదీ వరకు జరిగిన జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 6 (శనివారం) ఫలితాలను ప్రకటించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) బుధవారం వెల్లడించింది. జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్ష ఆన్సర్‌కీపైనా ఏమైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు ఆగస్టు 5లోగా అప్లై చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఇందుకోసం విద్యార్థులు ఒక్కో ప్రశ్నకు రూ. 200 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే ఐదు రోజుల పాటు జరిగిన ఈ రెండో విడత పరీక్షలకు మొత్తం 6.29 లక్షల మంది హాజరయ్యారు. అంతకు ముందు జరిగిన జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షా ఫలితాలను జులై 11న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షను జూన్ 23 నుంచి 29 వరకు నిర్వహించారు. ఫలితాలు విడుదలకాగానే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
* ముందుగా జేఈఈ మెయిన్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
* అనంతరం హోమ్ పేజీలో ఉన్న జేఈఈ మెయిన్ రిజల్ట్స్ 2022 లింక్‌పై క్లిక్ చేయాలి.
* తర్వాత అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ లేదా పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి.
* చివరిగా సబ్‌మిట్ బటన్‌పై నొక్కితే స్క్రీన్‌పై ఫలితాలు వచ్చేస్తాయి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..