NATA 2021 Result: నేడే ఎన్‌ఏటీఏ పరీక్షా ఫలితాలు.. ఇలా సులువుగా చెక్ చేసుకోండి..

Bachelor of Architecture 2021: నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (NATA) 2021 మొదటి పరీక్ష ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. ఈ నెల

NATA 2021 Result: నేడే ఎన్‌ఏటీఏ పరీక్షా ఫలితాలు.. ఇలా సులువుగా చెక్ చేసుకోండి..
Nata 2021 Result

Updated on: Apr 20, 2021 | 8:29 AM

Bachelor of Architecture 2021: నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (NATA) 2021 మొదటి పరీక్ష ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. ఈ నెల 20 న పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నట్లు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ బుధవారం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఫలితాలు విడుదలైన అనంతరం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ nata.in లో చూసుకోవచ్చు. ఎన్‌ఏటీఏ మొదటి పరీక్షను ఏప్రిల్ 10న కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నిర్వహించింది. ఐదేళ్ల బి.ఆర్క్‌ కోర్సు మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఎన్‌ఏటీఏ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తారు.

ఎన్ఏటీఏ ఫలితాన్ని ఇలా తనిఖీ చేసుకోండి..

మొదటగా.. ఎన్ఏటీఏ nata.in అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి.
హోమ్ పేజీలో ఎన్ఏటీఏ ఫలితం 2021 లింక్‌పై క్లిక్ చేయాలి
అభ్యర్థులు లాగిన్ అయ్యేందుకు పలు వివరాలను నమోదు చేయాలి
అనంతరం ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
ఫలితం కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

కాగా.. ఎన్ఏటీఏ పరీక్ష అర్హత సాధించడానికి మొత్తం 200 మార్కుల్లో కనీసం 75 మార్కులు సాధించాల్సి ఉంటుంది. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ రెగ్యులేషన్స్ 2020 ప్రకారం.. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ కోర్సులో ప్రవేశం పొందటానికి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నిర్వహించే.. ఆప్టిట్యూడ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. అయితే పరీక్ష స్కోరు 2021-22 అకాడెమిక్ సెషన్‌కు మాత్రమే చెల్లుబాటవుతుంది.

ఈ పరీక్షను భారతదేశంతోపాటు పలు దేశాల్లో మొత్తం 196 కేంద్రాల్లో నిర్వహించారు. ఈ మొదటి పరీక్షకు మొత్తం 15066 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 14,130 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే మొదటి పరీక్షలో ఉత్తీర్ణత కాకపోయినా.. హాజరుకాలేకపోయినా రెండో పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్‌ఏటీఏ రెండో రెండవ పరీక్ష జూన్ 12న జరగాల్సి ఉంది. కానీ.. కోవిడ్ కారణంగా మళ్లీ పరీక్ష వాయిదా పడే అవకాశం ఉంది.

Also Read:

కరోనా ఉధృతి కారణంగా పెరుగుతున్న ఆంక్షలు.. భారత ప్రయాణ రాకపోకలపై అమెరికా కీలక సూచనలు

 

Loading...
Unable to load recommendations.
Follow Us