NABARD Prelims Exam 2021: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్(నాబార్డ్) ఆఫీసర్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2021 తేదీలను విడుదల చేసింది. గ్రేడ్ A, B పరీక్ష తేదీలు విడుదల చేశారు. పరీక్షల తేదీలకు సంబంధించిన వివరాలను నాబార్డ్ అధికారిక సైట్ అయిన nabard.org లో అందుబాటులో ఉంచారు. అధికారిక ప్రకటన ప్రకారం.. ) మేనేజర్ పోస్ట్‌కు ఈ ఏడాది సెప్టెంబర్ 17వ తేదీన, అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కోసం సెప్టెంబర్ 18వ తేదీన పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్ష విధానం..
ఈ పరీక్షలో భాగంగా ముందుగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ప్రిలిమినరీ పరీక్షలో 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రతీ ప్రశ్నకు 200 మార్కులు ఉంటాయి. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లీష్‌లో ఉంటుంది. అన్ని పరీక్షలకు కలిపి 120 నిమిషాల సమయం ఇచ్చారు. కాగా, రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఆ తరువాత మళ్లీ మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఉంటాయి. ఇందుకోసం 1.25, 1:3 నిష్పత్రి చొప్పున అభ్యర్థులను సెలక్ట్ చేశారు.
ఇదిలాఉంటే.. మొత్తం 7 మేనేజర్ పోస్టులు, 153 ఏఎం పోస్టుల భర్తీకి నాబార్డ్ నోటిఫికేషన్ జారీ చేయగా.. గ్రేడ్ A, గ్రేడ్ B పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఆగస్టు 7వ తేదీ వరకు అవకాశం ఉంది. ఇక ఈ ఉద్యోగాల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 17వ తేదీన ప్రారంభమైంది.
Also read:
GHMC: రెండు రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. ఆచూకీ లభించని జీహెచ్ఎంసీ కార్మికుడి డెడ్‌బాడీ
Viral Video: మొసలికి చిక్కిన అడవి దున్న.. కట్ చేస్తే సీన్ రివెర్స్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!