Post Office Recruitment: పదవ తరగతి పాసైన నిరుద్యోగులకు గుడ్ న్యూస్. స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టుల భర్తీకి ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. బెంగళూరులోని మెయిల్ మోటార్ సర్వీస్‌లో పనిచేయుటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మొత్తం 15 ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.indiapost.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. గత 10 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ నెల 10 వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుంది.
ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు గరిష్టంగా 56 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపికైనవారికి ఏడో పేకమిషన్ లెవెల్ 2 పే స్కేల్ వర్తిస్తుంది. రూ.19,900 బేసిక్‌తో వేతనం లభిస్తుంది.
దరఖాస్తులను పంపించాల్సిన అడ్రస్
The Manager,
Mail Motor Service,
Bengaluru-560001.
దరఖాస్తు చేసుకోవడానికి ఇంక మూడు రోజులే సమయం ఉంది. చివరి తేదీ లోగా అప్లికేషన్స్ ఈ అడ్రస్‌కు చేరేలా పంపించాలి