
హైదరాబాద్, అక్టోబర్ 6: దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ 2027 (JEE Main 2027) తొలి విడత పరీక్షలకు సంబంధించిన తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. ఈసారి జనవరి 22 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనే విషయంపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
జేఈఈ మెయిన్ గత సంవత్సరాల షెడ్యూల్‌ను పరిశీలిస్తే.. తొలి విడత పరీక్షలకు కొన్ని నెలల ముందుగానే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతూ వస్తోంది. జేఈఈ మెయిన్ 2026 సెషన్-1 రిజిస్ట్రేషన్లు అక్టోబర్ 31న, 2025లో అక్టోబర్ 28న ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో 2027 సెషన్-1కు కూడా అక్టోబర్ చివరి వారంలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే NTA అధికారికంగా తేదీని ప్రకటించే వరకు దీనిని ఖచ్చితమైన షెడ్యూల్‌గా పరిగణించకూడదు. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా విద్యార్థులు అవసరమైన వివరాలు, పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ కింది సర్టిఫికెట్లు మీ వద్ద ఉండాలి. అవేంటంటే..
వీటిలో పేర్లు, పుట్టిన తేదీ వంటి వివరాలు సరిగ్గా ఉన్నాయో ముందుగానే పరిశీలించుకోవాలి. జేఈఈ మెయిన్ 2027కు సంబంధించిన రిజిస్ట్రేషన్ తేదీ, దరఖాస్తు విధానం, పరీక్షా కేంద్రాలు, అడ్మిట్ కార్డు, పరీక్షా మార్గదర్శకాలు తదితర వివరాలను NTA అధికారిక JEE Main వెబ్‌సైట్‌లో మాత్రమే ధ్రువీకరించుకోవాలి. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీపై అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో, విద్యార్థులు సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక తేదీలను నమ్మకుండా NTA అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.