JEE Main 2025 January: మరో 10 రోజుల్లో జేఈఈ మెయిన్‌ 2024 తొలివిడత షెడ్యూల్‌..! పరీక్ష ఎప్పుడంటే..

|

Sep 24, 2024 | 3:49 PM

జేఈఈ మెయిన్‌ 2025 పరీక్ష తేదీలు ఎన్‌టీఏ మరో పది రోజుల్లో ప్రకటించనుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తుంది. జాతీయ విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్‌ పరీక్షలను ప్రతీ యేట రెండు విడతలుగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌ విధానంలో దేశ వ్యాప్తంగా జరిగే ఈ పరీక్షలకు లక్షలాది మంది విద్యార్ధులు పోటీ పడతారు. గతేడాది రెండు విడతలకు కలిపి ఏకంగా 24 లక్షల మంది విద్యార్ధులు..

JEE Main 2025 January: మరో 10 రోజుల్లో జేఈఈ మెయిన్‌ 2024 తొలివిడత షెడ్యూల్‌..! పరీక్ష ఎప్పుడంటే..
JEE Main 2025 January
Follow us on

హైదరాబాద్, సెప్టెంబర్‌ 24: జేఈఈ మెయిన్‌ 2025 పరీక్ష తేదీలు ఎన్‌టీఏ మరో పది రోజుల్లో ప్రకటించనుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తుంది. జాతీయ విద్యాసంస్థల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి జేఈఈ మెయిన్‌ పరీక్షలను ప్రతీ యేట రెండు విడతలుగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌ విధానంలో దేశ వ్యాప్తంగా జరిగే ఈ పరీక్షలకు లక్షలాది మంది విద్యార్ధులు పోటీ పడతారు. గతేడాది రెండు విడతలకు కలిపి ఏకంగా 24 లక్షల మంది విద్యార్ధులు ఈ పరీక్షలు రాశారు. తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 3 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. నవంబరు నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ మొదలవుతుంది.దీనిని బట్టి చూస్తే.. జేఈఈ మెయిన్‌ పరీక్షలకు ఉన్న డిమాండ్‌ను అర్ధం చేసుకోవచ్చు. ఇక వచ్చే ఏడాదికి తొలి విడత పరీక్షలు జనవరి 20 తర్వాత మొదలయ్యే అవకాశం ఉంది. గత రెండేళ్లుగా జనవరి 24వ తేదీ నుంచి తొలి విడత పరీక్షలు జరుగుతున్నాయి. ఇక సీబీఎస్‌ఈ పరీక్షలు కూడా గత రెండేళ్ల నుంచి ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం అవుతున్నాయి. వీటితో పాటు ఇతర పరీక్షలకు ఆటంకం కలగకుండా జేఈఈ తొలి విడత పరీక్షలు తేదీలను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక రెండో విడత పరీక్షలు ఏప్రిల్‌ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

తెలగాణ డిగ్రీ ప్రవేశాలకు ఈ నెల 25 నుంచి స్పాట్‌ అడ్మిషన్లు

తెలంగాణ రాష్ట్రంలో దోస్త్‌ పరిధిలోని ప్రైవేట్, ప్రైవేట్‌ ఎయిడెడ్‌ కాలేజీల్లో స్పాట్‌ అడ్మిషన్లకు ప్రకనట వెలువడింది. సెప్టెంబరు 25 నుంచి 27 వరకు స్పాట్‌ విధానంలో ఆయా కాలేజీల యాజమాన్యాలు ప్రవేశాలు కల్పించవచ్చని దోస్త్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి తెలిపారు.

సెప్టెంబర్‌ నెలాఖరు వరకు ఇంటర్‌ ప్రవేశాలకు ఛాన్స్‌.. తెలంగాణ ఇంటర్‌ బోర్డు

తెలంగాణ రాష్ట్రంలో అన్ని జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ఇప్పటికే ఎన్నోసార్లు ఇంటర్‌బోర్డు గడువు పొడిగించుకుంటూపోయిన సంగతి తెలిసిందే. తాజాగా మరోమారు పొడిగించిన ఇంటర్ బోర్డు.. సెప్టెంబర్‌ నెలాఖరు వరకు ప్రవేశాలు పొందొచ్చని తెలిపింది. ప్రైవేట్‌ కాలేజీల్లో ప్రవేశాలు పొందేవారు రూ.500 ఆలస్య రుసుం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.