NVS Class 6 Admit Card 2022: జవహర్ నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష 2022 (JNVST 2022) అడ్మిట్ కార్డ్ విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్ కి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు NVS క్లాస్ 6 ప్రవేశ పరీక్ష 2022 కోసం దరఖాస్తు చేసి ఉంటే సులువుగా అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జవహర్ నవోదయ విద్యాలయ 6వ తరగతి అడ్మిషన్ కోసం ప్రవేశ పరీక్ష 30 ఏప్రిల్ 2022న నిర్వహిస్తున్నారు. అడ్మిట్ కార్డ్ లేకుండా మీరు పరీక్ష రాయడానికి అనర్హులు. ఇందుకోసం నవోదయ విద్యాలయ వెబ్‌సైట్ ని సందర్శించండి. హోమ్ పేజీలో మీరు JNVST క్లాస్ 6 అడ్మిట్ కార్డ్ 2022ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్‌ను చూస్తారు. దానిపై క్లిక్ చేయండి. నవోదయ విద్యాలయ సమితి పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్‌లోడ్ అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి. NVS క్లాస్ 6 అడ్మిట్ కార్డ్ 2022 పేజీ ఓపెన్ అవుతుంది. మీ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేయండి. స్క్రీన్‌పై కనిపించే సెక్యూరిటీ కోడ్‌కు సమాధానాన్ని నమోదు చేసి సైన్-ఇన్‌పై క్లిక్ చేయండి. వెంటనే NVS అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకొని భద్రంగా ఉంచుకోండి.
NVST 6వ తరగతి ప్రవేశ పరీక్ష 2022 ఏప్రిల్ 30న నిర్వహిస్తారు. ఇది రెండు గంటల పరీక్ష. కేవలం ఒక షిఫ్ట్‌లో నిర్వహిస్తారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ప్రశ్నపత్రంలో మానసిక సామర్థ్యం, అంకగణిత పరీక్ష, భాషా పరీక్ష మూడు విభాగాలు ఉంటాయి. మొత్తం 100 మార్కుల పరీక్ష ఉంటుంది. దీనికి 80 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటాయి.