ISRO VSSCలో చేరాలనుకునే యువతకు భలే ఛాన్స్.. డిగ్రీ మార్కులతో నేరుగా ఉద్యోగాలు

ISRO VSSC Apprentice Recruitment 2026: ISRO ఆధ్వర్యంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) 2026-27 సంవత్సరానికి 460 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు జులై 25, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు..

ISRO VSSCలో చేరాలనుకునే యువతకు భలే ఛాన్స్.. డిగ్రీ మార్కులతో నేరుగా ఉద్యోగాలు
ISRO VSSC Apprentice Recruitment

Updated on: Jul 19, 2026 | 12:21 PM

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఆధ్వర్యంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) తిరువనంతపుర.. 2026-27 సంవత్సరానికి గాను అప్రెంటిస్ నియామకాల కోసం అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీ, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 460 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా..

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీ పోస్టుల సంఖ్య: 273
  • టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల సంఖ్య: 187

ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. ఏరోనాటికల్/ఏరోస్పేస్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కమర్షియల్ ప్రాక్టీస్, హోటల్ మేనేజ్‌మెంట్, కేటరింగ్ టెక్నాలజీ తదితర విభాగాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్ధులు వయోపరిమితి 28 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయో సడలింపులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తాయి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జులై 25, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల విద్యార్హతల్లో సాధించిన మార్కులు, వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా మెరిట్ పద్ధతిలో తుది ఎంపిక చేపడతారు. ఎంపికైన వారికి నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు రూ.12,300, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు రూ.10,900 చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. అంతరిక్ష రంగంలో కెరీర్‌ను ప్రారంభించాలని భావిస్తున్న ఇంజినీరింగ్, డిప్లొమా అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ISRO వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో శిక్షణ పొందడం ద్వారా భవిష్యత్ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుచుకునే అవకాశం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

వాక్-ఇన్ సెలక్షన్ అడ్రస్..

కార్తీక తిరునాళ్ గవర్నమెంట్ వొకేషనల్ అండ్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఫర్ గర్ల్స్ (KTCT GVHSS), మణకాడు, తిరువనంతపురం జిల్లా, కేరళలో ఏర్పాటు చేసిన VSSC పెవిలియన్‌లో అభ్యర్థులు హాజరుకావాలి.

ముఖ్యమైన తేదీలు

  • వాక్-ఇన్ ఇంటర్వ్యూ / సెలక్షన్ డ్రైవ్: 25 జులై, 2026 (శనివారం)
  • దరఖాస్తుకు చివరి తేదీ: 25 జులై, 2026.

ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us