IRCON Finance Assistant Recruitment 2022: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీ (New Delhi)లోని ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (IRCON).. ఒప్పంద ప్రాతిపదికన ఫైనాన్స్ అసిస్టెంట్ పోస్టుల (Finance Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 16
ఖాళీల వివరాలు:
ఫైనాన్స్ అసిస్టెంట్ పోస్టులు: 8
హెచ్ఆర్ అసిస్టెంట్ పోస్టులు: 5
ఐటీ ఇన్ఛార్జ్ పోస్టులు: 3
వయోపరిమితి: ఏప్రిల్ 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.36,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్, పీజీ/డిప్లొమా, సీఏ/సీఎంఏ ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మే 9, 2022.
హార్డు కాపీలు పంపడానికి చివరి తేదీ: మే 16, 2022.
అడ్రస్: జేజాఎం/హెచ్ఆర్ఎం, ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, సీ-4, డిస్ట్రిక్ట్ సెంటర్, సాకేత్, న్యూఢిల్లీ – 110017.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: