Indian Navy: ఐటీఐ చేసిన వారికి ఇండియన్‌ నేవీలో ఉద్యోగాలు.. నెలకు రూ. 50 వేలకు పైగా జీతం..

|

Aug 04, 2022 | 5:49 PM

Indian Navy Recruitment: ఇండియన్‌ నేవీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. అండమాన్‌, నికోబార్‌ కమాండ్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో వివిధ యూనిట్లలో ఉన్న ట్రేడ్స్‌మ్యాన్‌ మేట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు...

Indian Navy: ఐటీఐ చేసిన వారికి ఇండియన్‌ నేవీలో ఉద్యోగాలు.. నెలకు రూ. 50 వేలకు పైగా జీతం..
Follow us on

Indian Navy Recruitment: ఇండియన్‌ నేవీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. అండమాన్‌, నికోబార్‌ కమాండ్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో వివిధ యూనిట్లలో ఉన్న ట్రేడ్స్‌మ్యాన్‌ మేట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 112 ట్రేడ్స్‌మ్యాన్‌ మేట్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత/ సంబంధిత ITI సర్టిఫికెట్ పొంది ఉండాలి.

ఇవి కూడా చదవండి

* అభ్యర్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణ తేదీ 06-08-2022న మొదలై 06-09-2022 తేదీతో ముగియనుంది.

* అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

* విద్యార్థులను రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన వారికి నెలకు రూ. 18,000 నుంచి రూ. 56,900 వరకు చెల్లిస్తారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..