Indian Navy Tradesman Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ నేవీ (Indian Navy ).. ట్రేడ్స్‌మన్ స్కిల్డ్ పోస్టుల (Tradesman Skilled posts)భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 1531
పోస్టుల వివరాలు: ఇండియన్ నేవీ ట్రేడ్స్‌మన్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్ శిక్షణ పూర్తి చేసి ఉండాలి లేదా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధిత టెక్నికల్ బ్రాంచ్‌లో రెండేళ్ల రెగ్యులర్ సర్వీస్‌తో మెకానిక్ లేదా తత్సమాన పనిలో అనుభవమున్న అభ్యర్థులు అర్హులు.
పే స్కేల్: నెలకు రూ. 19,900ల నుంచి రూ. 63,200ల వరకు జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: