Army Recruitment: ఇంజనీరింగ్ చేసిన వారికి ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ(ఓటీపీ) ఏప్రిల్ 2023 సంవత్సరానికి గాను పలు పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకోసం అవివాహిత పురుషులు, మహిళలు, డిఫెన్స్ పర్సనల్ విడోస్ నుంచి దరఖాస్తుల కోరుతున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 191 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్)మెన్ (175), ఎస్‌ఎస్‌సీ(టెక్) ఉమెన్ (14), విడోస్ డిఫెన్స్ పర్సనల్ (02) ఖాళీలు ఉన్నాయి.
* సివిల్/బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, మెకానికల్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, టెలీకమ్యూనికేషన్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ(టెక్)మెన్/ఉమెన్–సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ, ఎస్‌ఎస్‌సీ విడోస్(నాన్ టెక్నికల్)(నాన్ యూపీఎస్సీ)–ఏదైనా గ్రాడ్యుయేషన్, ఎస్‌ఎస్‌సీ విడో(టెక్నికల్)–బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
* ఎస్‌ఎస్‌సీ(టెక్)మెన్/ఉమెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారి వయసు 01-04-2023 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే ఎస్‌ఎస్‌సీ విడోస్(నాన్ టెక్నికల్) (నాన్ యూపీఎస్సీ), ఎస్‌ఎస్‌సీ విడో(టెక్నికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారి వయసు 01-04-2023 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 24-08-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..