AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10th Class Jobs 2026: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా ఉద్యోగాలు

భారతీయ తపాలా శాఖ సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో తపాలా జీవిత బీమా (PLI), గ్రామీణ తపాలా జీవిత బీమా (RPLI) పాలసీల సేకరణ కోసం కమిషన్ ఆధారంగా ఏజెంట్లను నియమించనుంది. 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు 18 సంవత్సరాల వయస్సు నిండిన అభ్యర్థులు ఆగస్టు 7, 2026లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి ఆగస్టు 14న ఇంటర్వ్యూ నిర్వహించనుంది..

10th Class Jobs 2026: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా ఉద్యోగాలు
India Post Postal Life Insurance Agent Recruitment
Srilakshmi C
|

Updated on: Jul 21, 2026 | 7:43 AM

Share

హైదరాబాద్, జూలై 21: భారతీయ తపాలా శాఖ సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో తపాలా జీవిత బీమా (PLI), గ్రామీణ తపాలా జీవిత బీమా (RPLI) పాలసీల సేకరణ కోసం కమిషన్ ఆధారంగా ఏజెంట్లను నియమించనున్నట్లు ప్రకటించింది. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి 18 సంవత్సరాలు నిండిన నిరుద్యోగ యువతకు ఇది మంచి ఉపాధి అవకాశంగా నిలవనుంది. తపాలా శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, మాజీ జీవిత బీమా సలహాదారులు, వివిధ బీమా కంపెనీల మాజీ ఏజెంట్లు, మాజీ సైనిక ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు కూడా ఈ నియామకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరం, వికారాబాద్ ప్రాంతాల్లో నివసించే అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను సికింద్రాబాద్ డివిజనల్ ఆఫీస్, గాంధీనగర్ – 500080 చిరునామాకు ఆగస్టు 7, 2026 లోపు సమర్పించాలి. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 14, 2026 ఉదయం 10 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూకు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావాల్సి ఉంటుంది. సికింద్రాబాద్ తపాలా సీనియర్ సూపరింటెండెంట్ ఎం. అన్నయ్య తెలిపిన వివరాల ప్రకారం, ఎంపికైన ఏజెంట్లు రూ. 5,000 విలువైన NSC లేదా KVP రూపంలో డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.

ఈ నియామకాలపై మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు తమ సమీప తపాలా కార్యాలయం లేదా సికింద్రాబాద్ డివిజనల్ ఆఫీస్, గాంధీనగర్‌ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు.

Follow Us
ఇదెక్కడి ట్విస్ట్ బాబూ.. బాలయ్య సినిమాలో విలన్ గా యంగ్ హీరోయిన్..
ఇదెక్కడి ట్విస్ట్ బాబూ.. బాలయ్య సినిమాలో విలన్ గా యంగ్ హీరోయిన్..
ICAIలో భారీగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. రూ.15.68లక్షల జీతం
ICAIలో భారీగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు.. రూ.15.68లక్షల జీతం
విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. రేపే అకౌంట్లోకి రూ.13 వేలు!
విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. రేపే అకౌంట్లోకి రూ.13 వేలు!
తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్ట్.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఆషాడమాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరో తెలుసా?
ఆషాడమాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరో తెలుసా?
వెల్లుల్లి నిజంగానే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందా..?
వెల్లుల్లి నిజంగానే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందా..?
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
సిక్కింలో ఘోర ప్రమాదం.. టన్నెల్‌లో చిక్కుకొని ఏడుగురు కార్మికులు మృతి
సిక్కింలో ఘోర ప్రమాదం.. టన్నెల్‌లో చిక్కుకొని ఏడుగురు కార్మికులు మృతి
టెస్లా నుంచి చిన్నారుల కోసం 'బ్యాలెన్స్ బైక్'.. ప్రత్యేకతలివే
టెస్లా నుంచి చిన్నారుల కోసం 'బ్యాలెన్స్ బైక్'.. ప్రత్యేకతలివే
ఆ ఒక్కడిని పక్కనపెట్టి పెద్ద తప్పు చేశారయ్యా గంభీర్..!
ఆ ఒక్కడిని పక్కనపెట్టి పెద్ద తప్పు చేశారయ్యా గంభీర్..!