India Post Skilled Artisans (Group C) Recruitment 2022: భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని ఇండియా పోస్ట్ (India Post).. 5 ఎంవీ మెకానిక్, ఎంవీ ఎలక్ట్రీషియన్, పెయింటర్, టైర్‌మ్యాన్ సర్వీస్ గ్రేడ్-సి (Skilled Artisan Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 8వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఏదైనా గుర్తింపు పొందిన టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్ నుంచి సంబంధిత ట్రేడుల్లో సర్టిఫికేట్ ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా అక్టోబర్ 19, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హులైన వారికి నెలకు రూ.19,900ల నుంచి రూ.63,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్: The Senior manager (JAG), Mail Motor Services, No-37, Greams Road, Chennai-600006.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.