IIT Tirupati Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Tirupati) ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ (Project Staff Posts) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, అర్హత ప్రమాణాలు, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీలు: 6
పోస్టుల వివరాలు:
1. ప్రాజెక్ట్ ఆఫీసర్లు: 3
విభాగాలు: వెబ్ డెవలస్‌మెంట్, నెట్వర్క్స్
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ/ఎమ్మెస్సీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
2. ప్రాజెక్ట్ అసిస్టెంట్లు: 3
విభాగాలు: సిస్టమ్స్, అడ్మినిస్ట్రేషన్
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ, బీఎస్సీ (సీఎస్)/బీసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం, టెక్నికల్ ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.20,000ల నుంచి రూ.30,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 27 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్ అనే రెండు స్టేజ్లలో జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 11, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: