ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ సిటీ.. ఒప్పంద ప్రాతిపదికన లెక్చరర్ (ఇంగ్లిష్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి ఇంగ్లిష్ స్పెషలైజేషన్‌లో పీజీ అర్హత కలిగిన వారికి మూడేళ్ల టీచింగ్ అనుభవం, ఎంఫిల్ అర్హత కలిగిన వారికి రెండేళ్ల టీచింగ్ అనుభవం, పీహెచ్డీ అర్హత కలిగిన వారికి ఏడాది టీచింగ్ అనుభవం ఉండాలి. ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో నవంబర్ 19, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపిచవల్సి ఉంటుంది. అలాగే కింది ఈ మెయిల్ ఐడీకి నవంబర్ 15వ తేదీలోపు దరఖాస్తులను పంపించాలి. అకడమిక్ మెరిట్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.50,000ల నుంచి రూ.70,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
ఈమెయిల్ ఐడీ: careers.faculty@iiits.in
The Registrar I/c.
Indian Institute of Information Technology, Sri City, Chittoor
630 Gnan Marg, Sri City,
Tirupati District – 517 646, Andhra Pradesh, India
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.