JEE Advanced 2026 Results: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌.. మరికొన్ని గంటల్లోనే రిజల్ట్స్‌! డైరెక్ట్‌ లింక్‌ ఇదే

JEE Advanced 2026 Result Date and Time: దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాలు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నాయి. ఈ మేరకు ఐఐటీ రూర్కీ ఫలితాల విడుదలకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం ఉదయం అధికారిక వెబ్ సైట్ లో ర్యాంకు కార్డులను అందుబాటులో ఉంచనుంది..

JEE Advanced 2026 Results: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌.. మరికొన్ని గంటల్లోనే రిజల్ట్స్‌! డైరెక్ట్‌ లింక్‌ ఇదే
JEE Advanced results

Updated on: May 31, 2026 | 2:59 PM

హైదరాబాద్‌, మే 31: దేశంలోని ప్రఖ్యాత ఐఐటీల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 ఫలితాలు సోమవారం (జూన్‌ 1) విడుదల కానున్నాయి. ఈ మేరకు ఐఐటీ రూర్కీ ప్రకటన వెలువరించింది. సోమవారం ఉదయం 10 గంటలకు అధికారిక వెబ్‌సైట్‌లో స్కోర్‌కార్డులు, ఆలిండియా ర్యాంకులను విడుదల చేస్తారు. డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా మొత్తం లక్ష 80 వేల మంది విద్యార్ధులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాశారు. వీరికి 17న పలు పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. అయితే ఇందులో ఈసారి 45 వేల వరకు విద్యార్దులు అర్హత సాధించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ క్వశ్చన్‌ పేపర్‌ కఠినంగా వచ్చినందున ఈసారి కటాఫ్‌ కూడా భారీగా తగ్గే అవకాశం ఉందని జ్యోష్యం చెబుతున్నారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గతేడాది (2025)లో కౌన్సెలింగ్ అర్హత కోసం కటాఫ్ మొత్తం 360 మార్కులకుగానూ 74గా నిర్ణయించారు. అయితే ఈ ఏడాది పరీక్ష మరింత కఠినంగా ఉన్నందున సుమారు 70 మార్కులు సాధించిన విద్యార్థులు కూడా అర్హత సాధించే అవకాశం ఉంది. సాధారణంగా జేఈఈ అడ్వాన్స్‌డ్ అభ్యర్థులలో సుమారు 25 నుండి 30 శాతం మంది అర్హత సాధిస్తారు. ఈ సంవత్సరం దాదాపు 45 వేల నుండి 50 వేల మంది విద్యార్థులు అర్హత సాధిస్తారని అంచనా.

కాగా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 23 ఐఐటీలలో బీ.టెక్, బీ.టెక్-ఎం.టెక్ డ్యూయల్ డిగ్రీ, బీఎస్ (సైన్స్), బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ వంటి కోర్సులతో సహా పలు కోర్సుల్లో సీట్లు కల్పిస్తారు. వీటిల్లో మొత్తం 18,160 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఈసారి పేపర్ కష్టంగా ఉన్నప్పటికీ 2026 కౌన్సెలింగ్ ప్రక్రియలో ముగింపు ర్యాంక్ ఈ అంకెకు దగ్గరగా ఉండే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 ఫలితాల్లో 92 మార్కులు సాధించిన ఓ విద్యార్ధి 20,792వ ర్యాంకుతో ఐఐటి వారణాసి (BHU)లో ఐదేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందాడు. 97 మార్కులు సాధించి 18,156వ ర్యాంకుతో ఐఐటి జమ్మూలోని మెటీరియల్స్ ఇంజనీరింగ్‌లో బి.టెక్‌లో మరో విద్యార్ధికి సీటు వచ్చింది. అమ్మాయిలకు కేటాయించిన విభాగంలో 80 మార్కులతో 28,481వ ర్యాంకు సాధించి ఐఐటి వారణాసి (బిహెచ్‌యు)లోని ఆర్కిటెక్చర్ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్‌ దొరికింది. అదే విభాగంలో మరో విద్యార్థిని 83 మార్కులతో 26,767వ ర్యాంకు సాధించి ఐఐటి జమ్మూలోని సివిల్ ఇంజనీరింగ్‌లో సీటు సంపాదించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us