IIT Recruitment: ఐఐటీ కాన్పూర్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 70 వేల వరకు జీతం పొందే అవకాశం..

|

Oct 11, 2022 | 12:06 PM

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ క్యాంపస్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో జూనియర్‌ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

IIT Recruitment: ఐఐటీ కాన్పూర్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 70 వేల వరకు జీతం పొందే అవకాశం..
Iit Recruitment
Follow us on

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ క్యాంపస్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో జూనియర్‌ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 119 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష/ జాబ్‌ ఓరియంటెడ్‌ ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు జీతంగా చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 09-11-2022ని నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..