IIT JAM 2022: ఐఐటీ జామ్ 2022 హాల్ టికెట్లు విడుదల.. పరీక్ష రోజున ఈ తప్పులు చేయకండి..

|

Feb 04, 2022 | 8:33 AM

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జాయింట్ అడ్మిషన్ టెస్ట్‌ (IIT JAM) 2022కు సంబంధించిన అడ్మిట్ కార్డులు (Admit Cards) విడుదలయ్యాయి...

IIT JAM 2022: ఐఐటీ జామ్ 2022 హాల్ టికెట్లు విడుదల.. పరీక్ష రోజున ఈ తప్పులు చేయకండి..
Iit Jam 2022
Follow us on

IIT JAM 2022 Exam Date: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జాయింట్ అడ్మిషన్ టెస్ట్‌ (IIT JAM) 2022కు సంబంధించిన అడ్మిట్ కార్డులు (Admit Cards) విడుదలయ్యాయి. పోస్టు గ్రాడ్యుయేషన్‌లో ప్రవేశాల కోసం జాయింట్ అడ్మిషన్ టెస్ట్‌కు హాజరయ్యే విద్యార్ధులు ఐఐటీ జామ్ అధికారిక వెబ్‌సైట్ jam.iitr.ac.in నుంచి అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో ఫిబ్రవరి 13, 2022న ఈ పరీక్ష జరగనుంది. ఫలితాలు మార్చి 22, 2022న ప్రకటించబడతాయి. ఐఐటీ జామ్ 2022 పరీక్షలో మొత్తం ఏడు టెస్ట్ పేపర్‌లు ఉంటాయి. అన్ని పేపర్లలోని ప్రశ్నలు పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటాయి.

ఐఐటీ జామ్ 2022 అడ్మిట్ కార్డులను కింది విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి..

  • ముందుగా jam.iitr.ac.inను ఓపెన్ చేయాలి
  • హోమ్ పేజీలో ఉన్న ఐఐటీ జామ్ అడ్మిట్ కార్డ్ 2022 లింక్‌పై క్లిక్ చేయాలి
  • లాగిన్ వివరాలను నమోదు చేసి, సబ్‌మిట్‌పై క్లిక్ చేయాలి
  • అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది
  • అభ్యర్ధులకు సంబంధించిన పూర్తి వివరాలు చెక్ చేసి, అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి

పరీక్ష రోజున అభ్యర్థులు సంబంధిత అడ్మిట్ కార్డును తప్పనిసరిగా పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాలి. లేదంటే లోపలికి ప్రవేశం ఉండదు. ఇతర పూర్తి వివరాల కోసం ఐఐటీ జామ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Also Read:

HAL Teacher Jobs 2022: హిందుప్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో 21 టీచర్ ఉద్యోగాలు.. సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇలా..