IIT Hyderabad Recruitment: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్ శివారుల్లో సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్న ఈ క్యాంపస్లో ఉన్న పలు నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 31 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో చీఫ్ లైబ్రరీ ఆఫీసర్ (01), అసిస్టెంట్ రిజిస్ట్రార్ (01), టెక్నికల్ ఆఫీసర్ (04), సెక్షన్ ఆఫీసర్ (01), అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) (01), టెక్నికల్ సూపరింటెండెంట్ (04), జూనియర్ ఇంజినీర్(ఎలక్ట్రికల్) (02), ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ (02), జూనియర్ టెక్నీషియన్ (09), మల్టీ స్కిల్ అసిస్టెంట్ గ్రేడ్-1 (06) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధరంగా పదో తరగతి, ఐటీఐ, డిగ్రీ, పీజీ పూర్తి చేసి ఉండాలి. అంతేకాకుండా సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* అభ్యర్థులు రూ. 500 అప్లికేషన్ ఫీజులగా చెల్లించాల్సి ఉంటుంది.
* ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణకు 19-09-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..