IBPS RRB 2026 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌.. రేపట్నుంచే రిజిస్ట్రేషన్లు

IBPS RRB ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. Office Assistant (Clerk), Officer Scale I, II, III పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపడుతున్నారు. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అర్హత, వయోపరిమితి, దరఖాస్తు విధానం, పరీక్ష తేదీలను పరిశీలించి ఆన్‌లైన్‌లో ఈ కింది లింక్ ద్వారా నేరుగా అప్లై చేసుకోవచ్చు..

IBPS RRB 2026 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌.. రేపట్నుంచే రిజిస్ట్రేషన్లు
IBPS RRB Recruitment

Updated on: Aug 31, 2026 | 4:23 PM

బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నుంచి భారీ నోటిఫికేషన్‌ వెలువడింది. IBPS RRB ఉద్యోగాలకు 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రీజినల్ రూరల్ బ్యాంకుల్లో (RRBs) వివిధ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపడుతున్నారు. ఈ నోటిఫికేషన్‌ కింద ఆఫీసర్‌ అసిస్టెంట్ (Clerk), ఆఫీసర్‌ స్కేల్‌ I, ఫీసర్‌ స్కేల్‌ II, ఫీసర్‌ స్కేల్‌ III పోస్టులు ఉన్నాయి. మొత్తం పోస్టుల సంఖ్య, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం వంటి ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

IBPS RRB ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IBPS RRB 2026 15వ ఎడిషన్ నియామకంలో పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. చాలా పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు మాత్రం సంబంధిత విభాగంలో విద్యార్హత అవసరం. Information Technology, Computer Science, Electronics and Communication, Agriculture, Horticulture, Dairy, Veterinary Science, Animal Husbandry వంటి విభాగాల్లో డిగ్రీలు అవసరం కావచ్చు. అలాగే పోస్టును బట్టి LLB, MBA లేదా సంబంధిత ఇంజినీరింగ్ డిగ్రీ వంటి అర్హతలు కూడా అవసరం కావచ్చు. అభ్యర్ధుల వయోపరిమితి పోస్టును బట్టి ఈ కింది విధంగా నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి
  • Office Assistant (Clerk): 18 నుంచి 28 సంవత్సరాలు
  • Officer Scale I: 18 నుంచి 30 సంవత్సరాలు
  • Officer Scale II: 21 నుంచి 32 సంవత్సరాలు
  • Officer Scale III: 21 నుంచి 40 సంవత్సరాలు

రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు పోస్టుకు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, ఇతర నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో తప్పనిసరిగా పరిశీలించాలి.

IBPS RRB ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ముఖ్యమైన తేదీలు

  • IBPS RRB Notification 2026 విడుదల తేదీ: ఆగస్టు 31, 2026.
  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: సెప్టెంబర్ 1, 2026.
  • దరఖాస్తుకు చివరి తేదీ: త్వరలో ప్రకటన
  • అప్లికేషన్ ఫీజు చెల్లింపు: ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియలోనే
  • అడ్మిట్ కార్డు: పరీక్షకు ముందు విడుదల
  • పరీక్ష తేదీలు: IBPS Calendar 2026-27 ప్రకారం

IBPS RRB ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us