Hydrocarbon Sector Skill Council Recruitment: హైడ్రోకార్బన్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ (హెచ్‌ఎస్‌ఎస్‌సీ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థలో మేనేజర్‌తో పాటు పలు ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 16 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* మొత్తం 16 ఖాళీలకు గాను మేనేజర్–05, అసిస్టెంట్ మేనేజర్–05, ఎగ్జిక్యూటివ్–06 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* స్టాండర్డ్స్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్(క్యూఏ), ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ అస్సెస్సర్స్, కరిక్యులమ్/కంటెంట్ డెవలప్‌మెంట్, అఫిలియేషన్ అండ్ ట్రైనింగ్ డెలివరీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. కంప్యూటర్ అప్లికేషన్స్‌లో బ్యాచిలర్స్/మాస్టర్స్ డిగ్రీ, ఎంబీఏ /మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల పీజీ డిగ్రీ, సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులవ్వాలి.
* వీటితో సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.
* అభ్యర్థుల వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు ఈమెయిల్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు తమ వివరాలను hr@hsscindia.in మెయిల్ ఐడీకి పంపించాలి.
* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 26.08.2021 నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
* ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి, విద్యార్హత ఏంటన్న పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Samsung Dost: భారత యువతకు అండగా శాంసంగ్ దోస్త్.. 50,000 మందికి ఉద్యోగం కల్పించడమే లక్ష్యంగా..
TGWDCW Recruitment: తెలంగాణలో పది ఉత్తీర్ణులైన మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్