HSL Recruitment: విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, ప్రాజెక్ట్ ఆఫీసర్, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్, సీనియర్ కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్ పోస్టులు ఉన్నాయి.
* హెచ్‌ఆర్, ఫైనాన్స్, టెక్నికల్, కమర్షియల్, సివిల్, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం ఆఫ్‌లైన్ మోడ్‌లో పంపించాల్సి ఉంటుంది.
* దరఖాస్తు హార్డ్ కాపీలను జనరల్ మేనేజర్, హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, గాంధీగ్రామ్, విశాఖటపట్నం 530005 అడ్రస్‌కు పంపించాలి.
* అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 52,000 నుంచి రూ. 2,20,000 వరకు చెల్లిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు మార్చి 30 – ఏప్రిల్ 20 వరకు, హార్డ్ కాపీలను పంపడానికి ఏప్రిల్ 05 – ఏప్రిల్ 25గా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: IPL 2022: CSK జట్టుకు భారీ షాక్.. 14 కోట్ల స్టార్ ప్లేయర్ ఔట్..?