31 ఏళ్లకే ఏడాదికి రూ.9 కోట్ల సంపాదన.. అయినా బిగ్‌టెక్ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పిన హైదరాబాద్ అమ్మాయి!

ఆర్థిక ఇబ్బందులు.. సంప్రదాయ కుటుంబ నేపథ్యం.. మహిళలకు స్వేచ్ఛపై ఆంక్షలు.. ఇలాంటి పరిస్థితుల నుంచి వచ్చిన ఓ హైదరాబాద్‌ యువతి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన విజయాన్ని సాధించారు. చిన్నతనంలో పెద్ద కలలు కనడానికి కూడా ప్రోత్సాహం లభించని ఆమె.. పట్టుదల, కష్టపడి పనిచేసే తత్వంతో అమెరికాలోని ప్రముఖ టెక్‌ కంపెనీల్లో ఉన్నత స్థానాలను అందుకున్నారు.

31 ఏళ్లకే ఏడాదికి రూ.9 కోట్ల సంపాదన.. అయినా బిగ్‌టెక్ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పిన హైదరాబాద్ అమ్మాయి!
Bala Sahitya Vadlamani

Updated on: Nov 28, 2026 | 8:42 PM

హైదరాబాద్‌: ఆర్థిక ఇబ్బందులు.. సంప్రదాయ కుటుంబ నేపథ్యం.. మహిళలకు స్వేచ్ఛపై ఆంక్షలు.. ఇలాంటి పరిస్థితుల నుంచి వచ్చిన ఓ హైదరాబాద్‌ యువతి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన విజయాన్ని సాధించారు. చిన్నతనంలో పెద్ద కలలు కనడానికి కూడా ప్రోత్సాహం లభించని ఆమె.. పట్టుదల, కష్టపడి పనిచేసే తత్వంతో అమెరికాలోని ప్రముఖ టెక్‌ కంపెనీల్లో ఉన్నత స్థానాలను అందుకున్నారు. 31 ఏళ్ల వయసులో ఏడాదికి 1 మిలియన్‌ డాలర్లకు పైగా (సుమారు రూ.9 కోట్లకు పైగా) సంపాదించే స్థాయికి చేరుకున్నారు. ఆమె పేరు బాల సాహిత్య వడ్లమాని.

ఇటీవల ఒక యూట్యూబర్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవిత ప్రయాణం, విద్యాభ్యాసం, ఉద్యోగాలు, భారీ జీతం, అమెరికా వీసా అనుభవాలు, చివరకు బిగ్‌టెక్‌ ఉద్యోగాన్ని వదిలి సొంత సంస్థ ప్రారంభించడానికి గల కారణాలను వెల్లడించారు.

ఉస్మానియా నుంచి డార్ట్‌మౌత్‌ వరకు..

హైదరాబాద్‌లో పెరిగిన బాల సాహిత్య వడ్లమాని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి మొదటి ర్యాంకు సాధించారు. అనంతరం అమెరికాలోని ప్రతిష్ఠాత్మక డార్ట్‌మౌత్‌ కాలేజీలో మాస్టర్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ చదివారు. డ్యూక్‌ యూనివర్సిటీలో ఎక్స్‌ఛేంజ్‌ విద్యార్థిగా చదువుతూ 4.0 జీపీఏ సాధించారు. అమెరికా వెళ్లడం కేవలం ఉన్నత విద్య కోసమే కాకుండా, తన జీవితంపై తానే నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను పొందేందుకు కూడా అని ఆమె చెప్పారు.

మూడు దిగ్గజ కంపెనీలు.. భారీ జీతాలు!

బాల సాహిత్య వడ్లమాని తన కెరీర్‌ను మోర్గాన్‌ స్టాన్లీలో టెక్నాలజీ అనలిస్ట్‌గా ప్రారంభించారు. అక్కడ ఆమెకు ప్రారంభ వార్షిక వేతనం 1.10 లక్షల డాలర్లు. ఆ తర్వాత అమెజాన్‌లో పనిచేస్తూ ఏఐ, అలెక్సా, చెల్లింపుల విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. అనంతరం మెటాలో చేరి ఇన్‌స్టాగ్రామ్‌, మెసెంజర్‌ భద్రత, ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌, ఐడెంటిటీ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో పనిచేశారు. ఈ క్రమంలో ఆమె ఆదాయం భారీగా పెరిగింది. 31 ఏళ్లకే ఏడాదికి మిలియన్‌ డాలర్లకు పైగా సంపాదించే స్థాయికి చేరుకున్నట్లు వెల్లడించారు.

కోట్ల జీతాన్ని వదిలి సొంత సంస్థ వైపు..

ఇంతటి భారీ ఆదాయం, ఉన్నత పదవులు ఉన్నప్పటికీ ఆమె బిగ్‌టెక్‌ ఉద్యోగాలకు స్వస్తి పలికారు. ప్రస్తుతం సొంత కన్సల్టింగ్‌ సంస్థను నిర్వహిస్తూ స్టార్టప్‌లు, వ్యవస్థాపకులకు ప్రొడక్ట్‌ స్ట్రాటజీ, ఏఐ అనుసంధానం, వ్యాపార అభివృద్ధిలో సలహాలు అందిస్తున్నారు.

ఉద్యోగం మారాలనుకునే వారికి మూడు ప్రశ్నలు వేసుకోవాలని ఆమె సూచించారు. కొత్త ఉద్యోగం మంచి వ్యక్తులతో పనిచేసే అవకాశం కల్పిస్తుందా? కొత్త నైపుణ్యాలను నేర్పిస్తుందా? భవిష్యత్తులో మరిన్ని అవకాశాలకు దారి తీస్తుందా? ఈ మూడింటిలో కనీసం రెండింటికి అవుననే సమాధానం వస్తే ఉద్యోగ మార్పును పరిశీలించవచ్చన్నారు.

తన విజయానికి అపారమైన తెలివితేటల కంటే వ్యూహాత్మక ఆలోచన, ఏకాగ్రత, కష్టపడే తత్వమే ప్రధాన కారణమని బాల సాహిత్య వడ్లమాని తెలిపారు. తనపై తాను నమ్మకం ఉంచుకుని ధైర్యంగా ముందడుగు వేయడమే విజయానికి మార్గమని యువతకు సందేశమిచ్చారు.

మరిన్ని కెరీర్ & ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us