Jobs: నిరుద్యోగులకు అలర్ట్! 2026 నాటికి ఈ మూడు రంగాల్లో 1.2 కోట్ల ఉద్యోగాలు..

|

Mar 29, 2022 | 7:08 AM

రానున్న రోజుల్లో దేశంలో ఉద్యోగాలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తాజా సర్వే వెల్లడించింది. ఇంజినీరింగ్‌, టెలికాం, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో 2025-26 నాటికి సుమారు 1.2 కోట్ల మందికి కొత్త ఉద్యోగాలు..

Jobs: నిరుద్యోగులకు అలర్ట్! 2026 నాటికి ఈ మూడు రంగాల్లో 1.2 కోట్ల ఉద్యోగాలు..
Jobs
Follow us on

Engineering, Telecom, Healthcare To Add 12 Million Jobs By 2026: రానున్న రోజుల్లో దేశంలో ఉద్యోగాలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తాజా సర్వే వెల్లడించింది. ఇంజినీరింగ్‌, టెలికాం, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో 2025-26 నాటికి సుమారు 1.2 కోట్ల మందికి కొత్త ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని టీమ్‌లీజ్‌ డిజిటల్‌ (TeamLease Digital) నివేదిక వెల్లడించింది. ఈ రంగాల్లో సాంకేతికత విస్తరణ, డిజిటలీకరణతో పాటు రికవరీపై దృష్టి నిలిపిన కారణంగా కొత్త ఉద్యోగాల రూపకల్సనకు అవకాశం ఉందని, ఇదే ప్రధాన కారణమని తెలిపింది. టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ స్టాఫింగ్‌ డివిజన్‌ టీమ్‌లీజ్‌ డిజిటల్‌.. ‘ప్రొఫెషనల్‌ స్టాఫింగ్‌-డిజిటల్‌ ఎంప్లాయిమెంట్‌ ట్రెండ్స్‌ రిపోర్ట్‌’ పేరుతో ఈ నివేదిక రూపొందించింది. ఇంజినీరింగ్‌, టెలికాం, ఆరోగ్య సంరక్షణ రంగాల్లోని సుమారు 750కు పైగా ఉద్యోగ సంస్థలు/అధిపతులను సర్వే చేసినట్లు పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. ఈ మూడు రంగాలు కలిపి ఉద్యోగావకాశాల సృష్టిలో 25-27 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది. నైపుణ్య ప్రతిభ లేదా ప్రత్యేక సిబ్బందికి గిరాకీ బాగా పెరిగి ప్రస్తుతం ఉన్న 45,65,000 మంది నుంచి 2026 నాటికి 90,00,000 మందికి చేరతారని అంచనా. టెలికాం, ఇంజినీరింగ్‌, ఆరోగ్య సంరక్షణ (Healthcare) రంగాల మార్కెట్‌ పరిమాణం కూడా సుమారు 1.5 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.114 లక్షల కోట్లు) స్థాయికి చేరుతుంది.

దేశంలో మొత్తం ఉద్యోగుల్లో 8.7 శాతం (4.2 కోట్లు) మంది ఈ 3 రంగాల్లో పని చేస్తుండగా, 2026 నాటికి మరో 1.2 కోట్ల అదనపు ఉద్యోగాలు లభించనున్నాయి. 2023 నాటికి కొత్త నమూనా అయిన గిగ్‌ (Gig policy) కూడా ఊపందుకునే అవకాశం ఉంది. గిగ్‌ నమూనా 17 శాతం మేర వృద్ధి నమోదు చేయొచ్చు. సంప్రదాయంగా ఒక కంపెనీ కార్యాలయంలో పూర్తిస్థాయి ఉద్యోగం చేయడం కంటే స్వల్పకాలిక, తాత్కాలిక, స్వతంత్ర ఒప్పంద విధానంలో చాలా ఉద్యోగ సంస్థల్లో పని చేయడమే గిగ్‌ విధానం. ఈ నమూనాలో పని చేయడానికి, చేయించుకోవడానికి అభ్యర్థులు, కంపెనీలు ముందుకొస్తున్నాయి.

Also Read:

Telangana: తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశాల 2022-23కు దరఖాస్తు గడువు పెంపు!