EIL Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

|

Apr 14, 2022 | 5:05 PM

భారత ప్రభుత్వ రంగానికి చెందిన న్యూఢిల్లీలోని ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెడ్‌ (EIL).. చీఫ్‌ జనరల్‌ మేనేజర్ పోస్టుల (Chief General Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

EIL Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
Eil Recruitment 2022
Follow us on

EIL New Delhi Chief General Manager Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన న్యూఢిల్లీలోని ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెడ్‌ (EIL).. చీఫ్‌ జనరల్‌ మేనేజర్ పోస్టుల (Chief General Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 3

పోస్టుల వివరాలు: చీఫ్‌ జనరల్‌ మేనేజర్, జనరల్‌ మేనేజర్, డిప్యూటీ జనరల్‌ మేనేజర్ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 50 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ/బీఈ/బీటెక్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ, లా డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 3, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

CARI Bengaluru Recruitment 2022: పది/ఇంటర్‌ అర్హతతో.. సెంట్రల్‌ ఆయుర్వేద రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు..