ECIL Recruitment:హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఈ సంస్థ టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 08 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో టెక్నికల్ ఆఫీసర్ (01), సైంటిఫిక్ అసిస్టెంట్లు (07) పోస్టులు ఉన్నాయి.
* టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు.
* సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన వారు ముంబై, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన వారు గౌరిబిదనూర్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు రూ. 21,000 నుంచి రూ. 25,000 వరకు అందిస్తారు.
* అభ్యర్థులను వాక్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* వాక్‌ఇన్ ఇంటర్వ్యూలను 17-06-2022వ తేదీని సంబంధిత ఈసీఐఎల్ జోనల్ కార్యాలయాల్లో నిర్వహిస్తారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..