ECIL Recruitment: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఈ సంస్థ జూనియర్ ఆర్టిజన్ పోస్టులను భర్తీ చేస్తోంది. ఇందులో భాగంగా ఎంపికైన అభ్యర్థులు మైసూరులో పని చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 04 జూనియర్ ఆర్టిజన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఫిట్టర్ ట్రేడ్‌లో రెండేళ్ల ఐటీఐ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అంతేకాకుండా అసెంబ్లీ ఆఫ్ మెకానికల్, ప్రెసిషన్ మెకానికల్‌లో పని అనుభవం తప్పనిసరి.
* అభ్యర్థులు 31-08-2021 నాటికి 25 ఏళ్లు మించకూడదు.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 18,564 జీతంగా అందిస్తారు.
* అభ్యర్థులను రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తులను ఈసీఐఎల్ జోనల్ ఆపీస్, ఎల్‌ఐసీ బిల్డింగ్, మల్లేశ్వరం, బెంగళూరు, 56003 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు 17-09-2021గా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Venkatesh’s Drushyam 2 : దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వెంకటేష్ సినిమా..?
Viral Video: ఇంట్లోకి వచ్చిన నాగుపాము.. గృహిణి చేసిన పనికి ఫిదా అవుతోన్న నెటిజన్లు.