DMHO Rangareddy Medical Officer Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన రంగారెడ్డి జిల్లా నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో (DMHO Rangareddy District).. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 70 మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి (Medical Officer Posts) అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి ఎంబీబీఎస్, జీఎన్‌ఎం, బీఎస్సీ (నర్సింగ్) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు జులై 1, 2022 నాటికి 18 నుంచి 39 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆగస్టు 19, 2022లోపు ఆఫ్‌లైన్ విధానంలో ఈ కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్, రిజర్వేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అప్లికేషన్ రుసుముగా జనరల్ అభ్యర్ధులు రూ.200లు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/వికలాంగ అభ్యర్ధుకలు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఎంపికైన అభ్యర్ధులకు స్టాఫ్ నర్స్ పోస్టులకైతే నెలకు రూ.29,900లు, మెడికల్ ఆఫీసర్ పోస్టులకు రూ.52,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అడ్రస్: DMHO, Shivarampalli, Rajendranagar, Rangareddy District, Telangana.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి..టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..