DMHO Nagarkurnool Jobs: రాత పరీక్షలేకుండా నాగర్‌కర్నూల్‌ జిల్లా ప్రభుత్వ దవాఖానాల్లో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే..

|

Sep 14, 2022 | 4:50 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నాగర్‌కర్నూల్‌ జిల్లా (Nagarkurnool District)లోని పట్టణ, గ్రామ దవాఖానాల్లో.. ఒప్పంద ప్రాతిపదికన 41 మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టుల (Mid level health provider Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

DMHO Nagarkurnool Jobs: రాత పరీక్షలేకుండా నాగర్‌కర్నూల్‌ జిల్లా ప్రభుత్వ దవాఖానాల్లో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే..
DMHO
Follow us on

DMHO Nagarkurnool District MLHP Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నాగర్‌కర్నూల్‌ జిల్లా (Nagarkurnool District)లోని పట్టణ, గ్రామ దవాఖానాల్లో.. ఒప్పంద ప్రాతిపదికన 41 మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ పోస్టుల (Mid level health provider Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంబీబీఎస్‌తోపాటు ఎంబీబీఎస్‌/బీఏఎంస్‌/బీఎస్సీ నర్సింగ్‌/జీఎన్‌ఎంలో ఉత్తీర్ణత సాధించి సాధించి ఉండాలి. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది. 2020 తర్వాత బీఎస్సీ నర్సింగ్‌/జీఎన్‌ఎంలో ఉత్తీర్ణత సాధించినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే కమ్యూనిటీ హెల్త్‌లో 6 నెలల బ్రిడ్జ్‌ ప్రోగ్రాం పూర్తిచేసి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 17, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, రిజర్వేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. సెప్టెంబర్‌ 18 నుంచి 28 వరకు డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌ ఉంటుంది. ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ అక్టోబర్‌ 3, 2022వ తేదీన విడుదల అవుతుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.29,900ల నుంచి రూ.40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌: District Medical & Health Office, Nagarkurnool District, Telangana.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.