DDA Recruitment: ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీలో భారీగా ఉద్యోగాలు.. అర్హులెవరంటే..

DDA Recruitment 2022: ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (DDA) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న మొత్తం 279 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

DDA Recruitment: ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీలో భారీగా ఉద్యోగాలు.. అర్హులెవరంటే..
DDA Jobs

Updated on: Jun 12, 2022 | 12:35 PM

DDA Recruitment 2022: ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (DDA) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న మొత్తం 279 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 279 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో జూనియర్‌ ఇంజినీర్‌ సివిల్‌ 220, జూనియర్‌ ఇంజినీర్‌ ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ 35, ప్రోగ్రామర్‌ 2, ప్లానింగ్‌ అసిస్టెంట్‌ 15, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌ 6, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ 1 ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా పీజీ డిప్లొమా, డిప్లొమా, బీటెక్‌‌, పీజీ చేసి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఆన్‌లైన్‌ రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 10-06-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* రాత పరీక్షను సెప్టెంబర్‌ నెలలో నిర్వహించనున్నారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us