CUET 2022 Revised Schedule: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) 2022 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ పొడిగిస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటన విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం 2022-23 విద్యా సంవత్సరానికిగానూ ఏప్రిల్ 6 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎన్టీఏ గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. సీయూఈటీ 2022 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 2న ప్రారంభంకావల్సి ఉంది. కొన్ని కారణాల రిత్యా ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్‌ను సవరించి కొత్త తేదీలను విడుదల చేసింది. దీంతో దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 6 నుంచి మే 6 రాత్రి 11 గంటల 55 నిముషాల వరకు కొనసాగనుంది. ఐతే విద్యార్ధులు గమనించవల్సిన విషయం ఏమిటంటే.. ఎన్టీఏ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తేదీలను మాత్రమే సవరించింది. ఖచ్చితమైన పరీక్షతేదీని ఇప్పటి వరకు ప్రకటించనప్పటికీ.. పరీక్షలు మాత్రం ముందు ప్రకటించిన విధంగానే జులై మొదటి లేదా రెండో వారంలో నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. పూర్తి సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్ cuet.samarth.ac.inలో చెక్ చేసుకోవచ్చు.
కాగా సీయూఈటీ 2022 పరీక్ష రెండు స్లాటుల్లో, ఆన్‌లైన్ (CBT) విధానంలో జరగనుంది. మొదటి స్లాట్ పరీక్ష 195 నిముషాలు, రెండో స్లాట్ పరీక్ష 225 నిముషాల పాటు మొత్తం 13 భాషల్లో, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల (MCQ) రూపంలో జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరణాత్మక సమాచార బులెటిన్ ఎన్టీఏ త్వరలో విడుదల చేయనుంది. ఐతే పరీక్ష విధానం, సిలబస్ వంటి సమాచారాన్ని ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
Also Read: