CPCL JEA Recruitment 2022: చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో 72 జూనియర్‌ ఇంజనీర్‌ అసిస్టెంట్‌ జాబ్స్.. పూర్తి వివరాలు..

|

Apr 10, 2022 | 12:30 PM

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (CPCL).. జూనియర్ ఇంజనీర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ టెక్నికల్ అసిస్టెంట్‌ పోస్టుల (Junior Engineer Assistant Posts) భర్తీకి..

CPCL JEA Recruitment 2022: చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో 72 జూనియర్‌ ఇంజనీర్‌ అసిస్టెంట్‌ జాబ్స్.. పూర్తి వివరాలు..
Cpcl
Follow us on

CPCL Junior Engineer Assistant Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (CPCL).. జూనియర్ ఇంజనీర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ టెక్నికల్ అసిస్టెంట్‌ పోస్టుల (Junior Engineer Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 72

పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ టెక్నికల్ అసిస్టెంట్‌ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 26 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.24,000ల నుంచి రూ.1,05,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా కెమిస్ట్రీలో కనీసం 60 శాతం మార్కులతో బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము:
జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్ధులకు: రూ.1000
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్ఎస్‌ఎమ్‌/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 13, 2022.

జేఈఏ అడ్మిట్‌ కార్డులు విడుదల తేదీ: మే 2, 2022.

CPCL JEA Exam 2022 తేదీ: మే 8, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

BRO Recruitment 2022: నిరుద్యోగులకు తీపికబురు! బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌లో302 ఉద్యోగాలు.. త్వరలో..