CMSS Manager Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ (CMSS).. ఒప్పంద ప్రాతిపదికన మేనేజర్ (Manager Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 9
పోస్టులు: మేనేజర్ పోస్టులు
విభాగాలు: ఫైనాన్స్, క్యూలిటీ అస్యూరెన్స్, ఐటీ, ప్రొక్యూర్‌మెంట్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
పే స్కేల్: నెలకు రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 40 ఏళ్లకు మించరాదు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్/బీకామ్/బీఫార్మసీ/ఎల్‌ఎల్‌బీ/ఎంఫార్మసీ/ఎంబీఏ/ఎంసీఏ/సీఏ/ఐసీడబ్ల్యూఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: జనరల్ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్), సీఎంఎస్ఎస్, 2వ ఫ్లోర్, విశ్వ యువక్ కేంద్ర, టీన్‌మార్తి మార్గ్, చాణక్యపురి, న్యూఢిల్లీ 110021.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 8, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: