CLAT 2022 applicaion last date: యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT) 2022 దరఖాస్తు ప్రక్రియ రేపటితో (మే 9) ముగియనుంది. గతంలో క్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 31తో ముగియనుండగా దానిని ఎన్‌ఎల్‌యూ మే 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులెవరైనా ఉంటే అధికారిక వెబ్‌సైట్ consortiumofnlus.ac.inలో దరఖాస్తు చేసుకోవాలని ఈ సందర్భంగా ఎన్‌ఎల్‌యూ విద్యార్ధులకు సూచించింది. కాగా క్లాట్ 2022 ప్రవేశ పరీక్ష జూన్ 19న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించబడుతుంది. 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్ధులతోపాటు 12వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు కూడా UG-CLAT 2022కి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన అభ్యర్ధులు/ ఎల్‌ఎల్‌బీ చివరి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్ధులు CLAT LLMకు దరఖాస్తు చేసుకోవచ్చు.
క్లాట్ దరఖాస్తు రుసుము ఇలా..
జనరల్ అభ్యర్థులు రూ. 4,000, ఎస్సీ/ఎస్టీ/బీపీఎల్ అభ్యర్థులు రూ. 3,500లు దరఖాస్తు ఫీజు చెల్లించాలి. గత ఏడాది క్వశ్చన్ పేపర్‌ను కొనుగోలు చేసే అభ్యర్ధులు రూ. 500లు చెల్లించి పొందుకోవచ్చు. ఈ ఏడాది అన్‌రిజర్వ్‌డ్ అభ్యర్థులకు కౌన్సెలింగ్ ఫీజును కూడా కన్సార్టియం భారీగా తగ్గించింది. వీరికి ఫీజును రూ.50,000 నుంచి రూ.30,000కు కుదించింది. రిజర్వ్‌డ్ కేటగిరీ విద్యార్థులకు రూ.20,000గా నిర్ణయించింది.
Also Read: