CIPET Hyderabad Lecturer Recruitment 2022: భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) లెక్చరర్ పోస్టుల (Lecturer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 7
పోస్టుల వివరాలు: ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మెకానికల్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, ఎటక్ర్టికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ఖాళీలున్నాయి.
పే స్కేల్: నెలకు రూ.30,000ల నుంచి రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెసలైజేషన్‌లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వ్యాలిడ్ గేట్/నెట్ స్కోర్‌తోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: ప్రిన్సిపల్ డైరెక్టర్ అండ్ హెడ్, సీఎస్టీఎస్-హైదరాబాద్, ఐడీఏ, ఫేజ్-2, చర్లపల్లి, హైదరాబాద్ 500051.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 4, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: