CIPET Aurangabad Faculty Recruitment 2022: భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖకు చెందిన ఔరంగాబాద్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (CIPET Aurangabad).. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల (teaching jobs) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: లెక్చరర్, అసిస్టెంట్ ప్లేస్‌మెంట్ కన్సల్టెంట్, ఇన్‌స్ట్రక్టర్, కన్సల్టెంట్ ట్రైనీ పోస్టులు
పే స్కేల్: నెలకు రూ.25,000ల నుంచి రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెసలైజేషన్‌లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/డీపీటీ/డీపీఎంటీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: సీఎస్‌టీఎస్-ఔరంగాబాద్, ప్లాట్ నెం: జే-3/2, ఎంఐడీసీ ఇండస్ట్రియల్ ఏరియా, చికల్‌తానా, ఔరంగాబాద్-431006.
దరఖాస్తులకు చివరి తేదీ: మే 6, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: