CARI Bengaluru Recruitment 2022: పది/ఇంటర్‌ అర్హతతో.. సెంట్రల్‌ ఆయుర్వేద రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు..

|

Apr 14, 2022 | 4:55 PM

భారత ప్రభుత్వ ఆయుష్‌ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని సెంట్రల్‌ ఆయుర్వేద రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (CARI).. సోషల్‌ వర్కర్‌, ఫీల్డ్‌ కలెక్టర్‌ తదితర పోస్టుల (Social Worker Posts) భర్తీకి అర్హులైన..

CARI Bengaluru Recruitment 2022: పది/ఇంటర్‌ అర్హతతో.. సెంట్రల్‌ ఆయుర్వేద రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు..
Ayush Jobs
Follow us on

CARI Bengaluru Social Worker Recruitment 2022: భారత ప్రభుత్వ ఆయుష్‌ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని సెంట్రల్‌ ఆయుర్వేద రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (CARI).. సోషల్‌ వర్కర్‌, ఫీల్డ్‌ కలెక్టర్‌ తదితర పోస్టుల (Social Worker Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 8

పోస్టుల వివరాలు:

  • సోషల్‌ వర్కర్‌ పోస్టులు: 1
  • ఫీల్డ్‌ కలెక్టర్‌ పోస్టులు: 1
  • ల్యాబొరేటరీ అటెండెంట్‌ పోస్టులు: 3
  • మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులు: 3

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 25 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.18,000ల నుంచి 29,200ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, సైన్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌, సంబంధిత స్పెషలైజేషన్‌ బీఎస్సీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 30, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

APIIC Recruitment 2022: డిగ్రీ అర్హతతో.. ఏపీలోని ఇండస్ట్రీయల్‌ సిటీ డెవలప్‌మెంట్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..పూర్తి వివరాలు