BSF Recruitment 2022: బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌లో 1312 హెడ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. టెన్త్‌/ఇంటర్‌ పాసైతే చాలు..

|

Aug 11, 2022 | 1:54 PM

కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని డైరెక్టరేట్‌ జనరల్ బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌ (BSF).. 1312 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

BSF Recruitment 2022: బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌లో 1312 హెడ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. టెన్త్‌/ఇంటర్‌ పాసైతే చాలు..
Bsf
Follow us on

BSF Head Constable Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని డైరెక్టరేట్‌ జనరల్ బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌ (BSF).. 1312 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిల్లో హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ పోస్టులు 982 ఉండగా, హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ పోస్టులు 330 వరకు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. అభ్యర్ధులు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పదో తరగతి, రేడియో అండ్‌ టెలివిజన్‌/ఎలక్ట్రానిక్స్‌/కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్/డేటా ప్రిపరేషన్‌ అండ్‌ కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌/జనరల్‌ ఎలక్ట్రానిక్స్‌/డేటా ఎంట్రీ ఆపరేట్‌/ఫిట్టర్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఎటక్ట్రానిక్స్ సిస్టమ్‌ మెయింటెనెన్స్/కామన్‌ ఎక్విప్‌మెంట్‌ మెయింటెనెన్స్/కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌/నెట్‌వర్క్‌ టెక్నీషియన్‌ విభాగాల్లో ఐటీఐ లేదా ఇంటర్మీడియట్‌లో కనీసం 20 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు ఖచ్చితంగా 18 నుంచి 25 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుముగా రూ.100లు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష/ఫిజికల్‌ టెస్టుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ప్రతిభ కనబరచిన వారికి నెలకు రూ.25,500ల నుంచి రూ.81,100ల వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ప్రారంభతేదీ: ఆగస్టు 20, 2022.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్‌ 28, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.